This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భవతులు పెయింటింగ్ వేయొచ్చా? | Can pregnant women paint in Telugu

Pregnancy Precautions
Written by - Sarada Ayyalaచివరిగా నవీకరించబడింది: Jan 1, 2024
గర్భవతులు పెయింటింగ్ వేయొచ్చా? | Can pregnant women paint in Telugu
Likes2 Likes|
Read time5 min

ఫర్నీచర్ అయినా, కాన్వాస్ అయినా, మహిళలు పెయింటింగ్‌ని ఇష్టపడతారు. మరి మీరు గర్భవతిగా ఉన్నప్పుడు పెయింట్ చేస్తే ఏం జరుగుతుంది? మీ సృజనాత్మకతను పక్కన పెట్టేస్తారా? మీ పెయింటింగ్‌ను వాయిదా వేస్తారా? గర్భవతిగా ఉన్నప్పుడు పెయింటింగ్‌పై మీకున్న సందేహాలు తీరుస్తే అనేక విషయాలను ఈ బ్లాగ్‌లో చర్చించాం.

ఈ రోజుల్లో, మోడర్న్ హౌజ్ పెయింట్స్ అన్నీ మంచి క్వాలిటీతోనే వస్తున్నాయి. కాబట్టి ఎక్కువగా పొగలు రాని, కడుపులోని మీ బిడ్డకు హాని కలిగించని పెయింట్స్ ఉపయోగించవచ్చు. గర్భవతిగా ఉన్నప్పుడు పెయింటింగ్ వల్ల కడుపులోని మీ బిడ్డకు ఎలాంటి హాని కలగదు. అయితే మీరు తక్కువ క్వాలిటీ ఉన్న సాల్వెంట్ బేస్డ్ పెయింట్స్ లేదా సీసం ఉన్న పెయింట్స్ ఉపయోగిస్తే ప్రమాదమే. సాల్వెంట్ బేస్డ్ పెయింట్స్, సీసం ఉన్న పెయింట్స్ వల్ల మీ బిడ్డకు హాని పెరగవచ్చు. గర్భవతిగా ఉన్నప్పుడు పెయింటింగ్ వేయడం సురక్షితమే. అయితే పెయింట్స్‌లో వేర్వేరు రకాల గురించి తెలుసుకొని, గర్భవతులు పెయింట్స్‌ని పరిమితంగా ఉపయోగించాలి.

రెండో ట్రైమిస్టర్ సమయంలో పెయింటింగ్ (Painting While Pregnant Second Trimester in Telugu)

పలురకాల కథనాల ప్రకారం, మొదటి ట్రైమిస్టర్‌లో పెయింట్స్‌కు, పెయింట్ పొగలకు కాస్త దూరంగా ఉండాలి. ఎందుకంటే, పెయింట్‌లో ఉండే రసాయనాలు ఉంటాయి. వాటిని గర్భవతులు పీల్చకూడదు. వీటిని పీల్చితే కడుపులో బిడ్డ అభివృద్ధికి సంబంధించిన సమస్యలకు దారితీస్తుంది. ఇక రెండో ట్రైమిస్టర్‌ సమయంలో పెయింట్ చేయడంలో ఇబ్బందేమీ లేదు. అయితే హానికారక పెయింట్ పొగల్ని, కెమికల్స్‌ని పీల్చకుండా జాగ్రత్తపడాలి.

పెయింట్ పొగలు మరియు మూడో ట్రైమిస్టర్ (Paint Fumes And Pregnancy Third Trimester)

ఇక మూడో ట్రైమిస్టర్‌లో, రెండో ట్రైమిస్టర్ లాగానే పెయింట్ చేయడంలో ఇబ్బందేమీ ఉండదు. అయితే ఇక్కడ కూడా జాగ్రత్తలు తప్పనిసరి. తక్కువ VOCs లేదా హై సాల్వెంట్స్ లేని పెయింట్స్ ఉపయోగించాలి. ఇక పెయింట్ చేసేప్పుడు గది వెంటిలేషన్ కూడా బాగుండాలి. దీని వల్ల పెయింట్ వాసన కాస్త తక్కువగా ఉంటుంది.

స్ప్రే పెయింట్ పొగలు మరియు గర్భవతులకు ఇబ్బందులు (Spray Paint Fumes and Pregnancy in Telugu)

గర్భవతిగా ఉన్నప్పుడు మొదటి ట్రైమిస్టర్‌లో పెయింట్ పొగలు తీవ్రంగా హాని చేస్తాయి. గర్భంలో పిండం అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వీటి వల్ల శిశువు నాడీ వ్యవస్థ, మూత్రనాళాలు, చెవి, ముక్కు, గొంతుపై ప్రభావం చూపిస్తుంది. అందుకే గర్భవతిగా ఉన్నప్పుడు వీలైతే పెయింటింగ్‌కు దూరంగా ఉండటం మంచిది. లేకపోతే పెయింట్ పొగలకు దూరంగా ఉండాలి. కొత్తగా పెయింట్ వేసిన గదుల్లో పెయింటింగ్ పూర్తైన రెండు రోజుల వరకు పెయింట్ పొగలు వస్తుంటాయి. గర్భవతిగా ఉన్న మహిళలు అలాంటి గదులకు కొన్ని రోజుల వరకు దూరంగా ఉండాలి.

ఇక స్ప్రే పెయింట్ విషయానికి వస్తే, మైకం, వికారం, తలనొప్పి లాంటి దుష్ప్రభావాలు ఉంటాయి. గర్భవతులు స్ప్రే పెయింట్‌కు లేదా వాటి వల్ల వచ్చే పొగలకు దూరంగా ఉండాలి. తద్వారా గర్భవతులు తమకు జరిగే హాని తప్పించుకోవడంతోపాటు వారి కడుపులో పెరుగుతున్న బిడ్డ నాడీ వ్యవస్థ అభివృద్ధికి నష్టం కలగకుండా చూడొచ్చు.

గర్భవతిగా ఉన్నప్పుడు ఉపయోగించడానికి వేర్వేరు రకాల పెయింట్స్

1. గర్భవతిగా ఉన్నప్పుడు యాక్రిలిక్ పెయింట్ (Acrylic Paint While Pregnant)

యాక్రిలిక్ లేదా ల్యాటెక్స్ లాంటి వాటర్ బేస్డ్ పెయింట్స్‌లో గర్భిణులకు హానిచేసే కొన్ని ద్రావకాలు ఉండొచ్చు. యాక్రిలిక్ పెయింట్స్‌లో బయోసైడ్స్ లాంటి కొన్ని పదార్థాలు కాబోయే తల్లులకు తీవ్రమైన హాని చేయొచ్చు. అందుకే గర్భవతిగా ఉన్నప్పుడు యాక్రిలిక్ పెయింట్ ఉపయోగించకపోవడం మంచిది.

2. గర్భవతిగా ఉన్నప్పుడు ఆయిల్ పెయింటింగ్ (Oil Painting While Pregnant)

ఆయిల్ పెయింట్స్‌లో ప్రమాదకర రసాయనాలు ఉంటాయి. కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు వాటికి దూరంగా ఉండాలి. ఆయిల్ పెయింట్స్ కూడా VOCs రూపంలో ఆవిర్లను వదుల్తాయి. దీనివల్ల మైకం, అలసట, వికారం, తలనొప్పి లాంటి దుష్ప్రభావాలు ఉంటాయి. అందుకే గర్భవతులు అయిల్ పెయింట్స్‌కి కూడా దూరంగా ఉండాలి.

3. గర్భవతిగా ఉన్నప్పుడు వాటర్ కలర్ పెయింటింగ్ (Watercolour Painting While Pregnant)

గర్భవతిగా ఉన్నప్పుడు వాటర్ బేస్డ్ పెయింట్స్ ఉపయోగించడం మంచిది. ఎందుకంటే ఇందులో సాల్వెంట్స్, కెమికల్స్ చాలా తక్కువగా ఉంటాయి. దీంతో పాటు చాక్ పెయింట్స్, ఇళ్లల్లో ఉపయోగించే ఎమల్షన్ పెయింట్స్ లాంటివి సురక్షితమైన పెయింట్స్‌గా చెప్పుకోవచ్చు.

(Disclaimer)

గర్భవతిగా ఉన్నప్పుడు మీరు ఏవైనా పెయింట్స్ కొనాలనుకుంటే వాటి గురించి బాగా తెలుసుకోవాలి. చిక్కులు ఎదురుకాకుండా వైద్యుల్ని లేదా హెల్త్ ఎక్స్‌పర్ట్‌ని సంప్రదించాలి.

FAQ's

1. గర్భవతిగా ఉన్నప్పుడు మాస్క్ ధరించి నేను పెయింట్ వేయొచ్చా? (Can I Paint While Pregnant If I Wear a Mask)

గర్భవతిగా ఉన్నప్పుడు మాస్క్ ధరించి పెయింటింగ్ వేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పెయింట్ పొగల నుంచి కాబోయే తల్లుల్ని కొంతవరకైనా మాస్క్ రక్షిస్తుంది. అయితే ఈ కెమికల్స్‌ని దూరంగా ఉంచడంతో పాటు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు రాకుండా ఉండేందుకు మంచి క్వాలిటీ మెటీరియల్స్‌తో తయారు చేసిన మాస్క్ ఉపయోగించాలి.

2. నేను గర్భవతిగా ఉన్నప్పుడు యాక్రిలిక్ పెయింట్ ఉపయోగించవచ్చా? (Can I use acrylic paint while pregnant ?)

మంచి వెంటిలేషన్ ఉన్న గదిలో అయితే యాక్రిలిక్ పెయింట్ ఉపయోగించడం సురక్షితమే. అయితే హై క్వాలిటీ మెటీరియల్స్ ఉపయోగించి తయారు చేసిన పెయింట్ వాడాలి.

Tags

Painting during Pregnancy in Telugu, Which paint affect during Pregnancy in Telugu, Is painting safe during Pregnancy in Telugu, How to Choose the Right Materials for Painting During Pregnancy in Telugu, Precautions to Take When Painting While Pregnant in Telugu, Can pregnant women paint in English, Can pregnant women paint in Tamil, Can pregnant women paint in Bengali

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.